కర్నూలు: కర్నూల్ లో ముసుగుతో దొంగతనం — 24 గంటల్లోనే మహిళ అరెస్ట్
రేషన్ షాపు నుంచి తిరిగి వస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగతన కేసును కర్నూలు పోలీసులు 24 గంటల్లోనే చేదించారు. జయరాంనగర్లో డిసెంబర్ 1న ఉదయం ధనలక్ష్మి నగర్‌కు చెందిన దేవమ్మ (67)పై బుర్కా ధరించిన గుర్తు తెలియని మహిళ దాడి చేసి ఒక తులం బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటనపై మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. CI శేషయ్య నేతృత్వంలోని త్రీటౌన్ పోలీసులు ఆమె వద్ద నుండి బంగారు గొలుసు, కత్తి, కత్తెర, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.కోర్టులో హాజరుపరచగా జడ్జి 15 రోజుల రిమాండ్ విధించారు. కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన CI శేషయ్య, కానిస్టేబుళ్లు పరమేశ్, రాముడు, సు