చిగురుమామిడి: అమరుల ఆశయాల కోసం పోరాటం కొనసాగించాలి: చాడ వెంకట రెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో వివిధ గ్రామాలలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు సోమవారం సిపిఐ పార్టీ నాయకులు నిర్వహించారు. అమరుల ఆశయాల కోసం ఎర్ర జెండా సైనికులు పోరాటం కొనసాగించాలని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని ఇందుర్తి లో అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలలో నా అమరవీరుల స్థూపంల వద్ద వద్ద నివాళులు అర్పించి ర్యాలీ నిర్వహించారు.