కర్నూలు: హైకోర్టు కోసం వైసీపీ డ్రామా : టీడీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కేఈ జగదీశ్
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని వైసీపీ న్యాయవాదులు రోడ్లెక్కి ధర్నాలు చేయడం సిగ్గుచేటని టీడీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కేఈ జగదీశ్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం కర్నూలు టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ…"ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మీరు నిద్రపోయారా? అప్పట్లో హైకోర్టు కోసం ఎందుకు కదలికలు చేయలేదు? జగన్ దగ్గర ఎప్పుడూ మాట మాట్లాడని మీరు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లేందుకే వీధుల్లో డ్రామాలు చేస్తున్నారు" అని ప్రశ్నించారు.జనసమస్యలపై ఏ పని చేయకుండా, న్యాయవాదుల పేరుతో వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే వీర