బనగానపల్లె: రాంకో సిమెంట్ పరిశ్రమ బాధిత రైతులకు న్యాయం చేస్తాం :మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని రాంకో సిమెంట్ బాధ్యత రైతులకు న్యాయం చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, సుంకయ్య తదితరులు రాంకో బాధిత రైతులతో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.