మధిర: నాగిలికొండ గ్రామంలో కార్యకర్త ఇంటికి డిప్యూటీ సీఎం భట్టి
చింతకాని మండలం నాగిలికొండ గ్రామంలో గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పగడాల రాజు ఇంటికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలు, ప్రజలతో కలిసి కాఫీ తాగుతూ సరదాగా ముచ్చటించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అందుతున్న సంక్షేమ పథకాలపై ఆయన ఆరా తీశారు. గ్రామస్తులు సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.