డోన్: బేతంచెర్ల లో రహదారి వెంట వృధాగా పోతున్న త్రాగునీరు
Dhone, Nandyal | Jul 5, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్లలోని ప్రధాన రహదారి వెంట ఉన్న నగర పంచాయతీ తాగునీటి పైపైన్ పగిలిపోవడంతో రెండు రోజులుగా పెద్ద మొత్తంలో తాగునీరు వృథాగా పోతోంది. పైపైన్ నుంచి నీరు లీకవుతూ రహదారి పక్కన చిన్నపాటి కాలువను తలపిస్తోంది. తాగునీరు వృథా కావడం పట్ల పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి వృథాను అరికట్టాలని అధికారులను కోరుతున్నారు.