బనగానపల్లె: కొలిమిగుండ్లలో ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన ర్యాలీ
ప్రభుత్వ పాఠశాలల్లోనే విలువలతో కూడిన విద్యా బోధన లభిస్తుందని కొలిమిగుండ్ల మండల విద్యాధికారి అబ్దుల్ కలాం పేర్కొన్నారు. సోమవారం ఉదయం మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం. సుంకన్న అధ్యక్షతన అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం ప్రారంభమై బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యా యులు మానవహారం నిర్మించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు