మేరా యువభారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా జనాభా పెరుగుదలలో సమతుల్యత పాటించాలని మై భారత్ జిల్లా యువజన అధికారి మహేందర్ రెడ్డి అన్నారు. ఒంగోలు నగరంలో శుక్రవారం సాయంత్రం వరల్డ్ పాపులేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జనాభా పెరుగుదలతో సమతుల్యత పాటించకుంటే ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి ఏర్పడుతుందని, కాబట్టి జనాభాతో పాటు ఆర్థిక వనరులను కూడా సంపాదించుకొని పెంపొందించుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.