వేలేరు: వేలేరు మాజీ ఎంపిటిసి పై అధికార పార్టీ నాయకుల దాడిని ఖండిస్తూ ఆందోళన చేపట్టిన మాజీ ఉప ముఖ్యమంత్రి
వేలేరు మాజీ ఎంపీటీసీ బత్తుల జ్యోతి పై ఇటీవల భూవివాద విషయంల కాంగ్రెస్ పార్టీకి సంబధించిన వ్యక్తులు అమానుషంగా దాడి చేసి పిడి గుద్దులు గుద్దుతు భూతులు మాట్లాడుతూ గాయపరిచిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య జ్యోతి స్వగృహానికి వెళ్లి, వారిని పరామర్శించి, సంఘటనకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం జరిగింది.. ఆ తరువాత జ్యోతి పై జరిగిన దాడికి నిరసనగా మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.