డోన్: చిత్తూరు జిల్లాలో విలేఖరి హత్యపై బేతంచెర్ల లో నిరసన
Dhone, Nandyal | Apr 29, 2026 చిత్తూరు జిల్లా పలమనేరులో ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జర్నలిస్టు, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు జగన్మోహన్ను హత్య చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బుధవారం బేతంచర్ల పాత బస్టాండ్లో ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా ఈ దుర్ఘటనకు పాల్పడిన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు.