రాజేంద్రనగర్: పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. జల్పల్లి గేట్ సమీపంలోని అర్బన్ ఫారెస్ట్ పార్క్ దగ్గర ఇద్దరు యువకులు బైక్పై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పహాడీషరీఫ్ పోలీసులు క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.