కరీంనగర్: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ లో కీలక మావోయిస్టు మృతి, పోలీసులు ఒప్పుకుంటే అంత్యక్రియలు నిర్వహిస్తాం
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోష్టులు మృతి చెందిన సంగతి తెలిసినదే. అందులో ఒక వ్యక్తి సత్య నారాయణ రెడ్డి సిరిసిల్ల జిల్లా గోపాల్ రావు పేట గ్రామం, సత్యనారాయణ అన్నయ్య కరుణాకర్ రెడ్డి కరీంనగర్ లో మీడియాతో మంగళవారం మాట్లాడారు.తన తమ్ముడు మృతి చెందిన విషయం సోషల్ మీడియా తెలుసుకున్నానని, అక్కడికి వెళ్లి అధికారులతో మాట్లాడి కడాసారి చూపులు చూస్తానని, వీలైతే మృతదేహం ఇస్తే అంత్యక్రియలు నిర్వహిస్తానని తెలిపారు.45 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లారని,అప్పటినుండి ప్రతిసారి పోలీసులు నన్ను గమనిస్తూనే ఉన్నారని తెలిపారు.