అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ రామేశ్వర స్వామి ఆలయం లో గత తొమ్మిది రోజులుగా కొలువుదీరిన శ్రీ గౌరీ దేవి అమ్మవారిని గురువారం సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పూల రథోత్సవంతో భక్తులు గ్రామోత్సవం నిర్వహించారు. మహిళలు యువతులు బాలికలు మంగళ హారతులతోను, కోలాట నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. అనంతరం స్థానిక మంగోటి చెరువులో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.