జిల్లా కోర్టులో దొంగలు పడ్డారు కోర్టు సిబ్బంది ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Ongole Urban, Prakasam | May 8, 2026
దొంగలకు శిక్షలు వేసే కోర్టులో దొంగలు పడటం గా చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా కోర్టులోని రెండవ ఏ ఎం ఎం కోర్ట్ మరియు మొబైల్ కోర్ట్ ప్రాపర్టీ రూములలో రాత్రి గుర్తు తెలియని దొంగలు పడి తలుపులు తాళాలు పగలగొట్టారు. కోర్టు కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నటువంటి బీరువాలను కూడా దొంగలు పగలగొట్టారు. విషయం గమనించిన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. దొంగతనానికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నగరం నడిబొడ్డున ఉన్న కోర్టు భవనాల సముదాయంలో దొంగలు పడటం చర్చగా మారింది.