పుంగనూరు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసిన నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ చిన్నా రాయల్.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చిన్నా రాయల్, శనివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కలంకరి శాలువాతో సత్కరించారు. అనంతరం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్సీ హరిప్రసాద్, కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై చర్చించారు.