ఒంగోలు అర్బన్: మలేరియా నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జిల్లా మలేరియా అధికారి ఎన్. మధుసూదన్ రావు
Ongole Urban, Prakasam | Jun 12, 2026
కలెక్టర్ రాజబాబు ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిటి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు మలేరియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భాగ్యనగర్ సాంఘిక సంక్షేమ మహిళా కళాశాల హాస్టల్ నందు మలేరియా వ్యతిరేక మాసో త్సవాలలో భాగంగా హాస్టల్ నందు దోమ నివారణకు ఐదు శాతం ఏ సీఎం క్రిమిసంహారి నీ పిచికారి చేశారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి ఎన్ మధుసూదన రావు మాట్లాడుతూ మలేరియా వ్యాధి వ్యాప్తిని వివరించి నివారణ మార్గాలను తెలిపారు