కర్నూలు: కీర్తి స్కూల్ గోడ కూలి రాఖీబీ మృతి చెందడంతో... తండ్రి ఖాజా మొహిద్దిన్ ఆవేదన
స్కూలుకు లేటుగా వచ్చారన్న కారణంతోనే పనిష్మెంట్ గా బయట నిలబెట్టడంతోనే తన కుమారుడు మృతి చెందాడని రాఖీబీ తండ్రి ఖాజా మొహిద్దిన్ మీడియాతో తెలిపారు. సోమవారం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ దగ్గర ఆయన మీడియాతో కన్నీరు అయ్యారు... కీర్తి పాఠశాల శిధిల వ్యవస్థకు చేరుకున్న పాఠశాలకు అనుమతులు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. చిన్నపిల్లలు ఏం తప్పు చేశారు. ప్రాణాలు పోయినా యాజమాన్యం స్పందించడం లేదని మీడియాకు తెలిపారు. వెంటనే పాఠశాల గుర్తింపుని రద్దుచేసి యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.