ఆళ్లగడ్డ: చిత్రేని పల్లె గ్రామంలో మెట్ల పైనుంచి పడి యువకుడు మృతి
నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని చిత్రేనిపల్లె లో విషాదం చోటుచేసుకుంది, ఎస్సై జయప్ప తెలిపిన వివరాల మేరకు చిత్రేనిపల్లె గ్రామానికి చెందిన నాగరాజు ఇంటిపై ఉన్న గదిలోకి వెళ్లడానికి మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి క్రింద పడిపోయాడు, తీవ్రంగా గాయపడడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు, చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు, మృతునికి భార్య కుమార్తె ఉన్నారు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు