కమలాపురం: అరుంధతి నగర్లో కేసీ కెనాల్ పూడికతీత పనులను ప్రారంభించిన అధికారులు
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చెన్నూరు మండలం చెన్నూరు లోని అరుంధతి నగర్ లో ఉన్న కేసీ కెనాల్లో శనివారం అధికారులు పూడికతీత పనులు ప్రారంభించారు.జెసిబి లతో కేసీ కెనాల్ కాలువ లోని పూడికను, గట్లపై ఉన్న కంప చెట్లు, ముళ్ల పొదల తొలగింపు పనులు చేపట్టారు. చెన్నూరు మండలం పరిధిలోని శివాలపల్లి నుండి ఓబులంపల్లి వరకు ఉన్న కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం కాలవలో నీరు లేకపోవడంతో అధికారులు పూడికతీత పనులను ప్రారంభించారు. కాలువలోని పూడికతీత వల్ల సాగునీరు సాఫీగా పారుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.