ఒంగోలు అర్బన్: తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి ఎన్టీ రామారావు : ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | May 28, 2026
మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని గురువారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ గారు ప్రజాసేవలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న మహానేత అన్నారు. ఎన్టీఆర్ కళారంగంలో తన అద్భుతమైన ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుని, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆయన పాత్రలు న్యాయం, ధర్మం, పరోపకారం వంటి విలువలను ప్రజల హృదయాల్లో నాటే విధంగా ఉండటం విశేషమన్నారు.