అదిలాబాద్ అర్బన్: బిర్సయిపేట సమస్యలపై మాజీ ఎంపీ సోయం బాపూరావును కలిసిన ఆదివాసులు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం బిర్సయిపేట గ్రామస్తులు తమ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అటవీ శాఖ ఆంక్షలు మరియు విద్యుత్ సమస్యల గురించి మాజీ ఎంపీ సోయం బాపూరావుకు వివరించారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.