హత్నూర: బిజెపి ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో స్వచ్ఛభారత్ : పాల్గొన్న మెదక్ అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్
మెదక్ పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ బిజెపి జిల్లా అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి తగ్గించడం వల్ల సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా నిర్వహిస్తున్న సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.