మల్యాల సైబర్ నేరాలపై 1930 కు కాల్ చేయండి, నందికొట్కూరు అర్బన్ సిఐ అశోక్ కుమార్
సైబర్ నేరాలు జరుగుతే 1930కు కాల్ చేయాలని నందికొట్కూరు అర్బన్ సిఐ అశోక్ కుమార్ పేర్కొన్నారు, ఆదివారం నందికొట్కూరు మండలం మల్యాల గ్రామంలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారు, ప్రభుత్వం మహిళలకు శక్తి యాప్ నెంబర్ 7993485111 ప్రవేశపెట్టిందన్నారు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు, బాల్యవివాహాలు చిన్న పిల్లలపై నేరాలు జరిగితే 1098 కు ఫిర్యాదు చేయాలని సూచించారు, ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై చంద్రశేఖర్ పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు