నందికోట్కూరు: కొత్తపల్లి మండలంలో ఒక్కసారిగా మారిన వాతావరణం
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది, ఉదయం నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోతులతో అల్లాడుతున్న, కొత్తపల్లి మండల ప్రజలకు సాయంత్రం నల్లటి మేఘాలు కమ్ముకొని చల్లని గాలులు వీయడంతో ఈ ప్రాంతమంతా చల్లబడింది, దీంతో ప్రజలకు కొంత మేర ఉపశమనం లభించింది, కొత్తపల్లి మండలంలో వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లాలంటే బెంబేలెత్తుతున్నారు