సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన AISF విద్యార్థి సంఘ నాయకులు
Eluru Urban, Eluru | Sep 21, 2025
ఏలూరు జిల్లా ఏలూరులో సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నారని AISF విద్యా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల హక్కులను ఉల్లంఘిస్తూ ఓ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహించడం పై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల వరకు ఆందోళన కొనసాగించారు ప్రభుత్వ నియమ నిబంధనలో ఉల్లంఘిస్తూ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం తరగతులు నిర్వహించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు