కోడుమూరు: మునగాలలో అంగనవాడి కేంద్రం తనిఖీ చేసిన నీతి ఆయోగ్ బృందం
గూడూరు మండలంలోని మునగాల గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని శనివారం నీతి ఆయోగ్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ సందర్భంగా అంగన్వాడి పరిధిలో ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆహార సరుకులపై లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పిల్లల బరువు, ఎత్తు తనిఖీ చేశారు. గర్భిణీలు, బాలింతలకు సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిడిపిఓ వరలక్ష్మి, సూపర్వైజర్ పద్మావతి, విజయలక్ష్మి పాల్గొన్నారు.