భద్రాచలం: 44 లక్షల వ్యయంతో ITC సంస్థ భద్రాచలం డిగ్రీ కళాశాలలో నిర్మించిన టాయిలెట్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే
ఐటీసీ సేవలు ప్రశంసనీయమని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. భద్రాచలం అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐటిసి రూ.44 లక్షల అంచనా వ్యయంతో బాలురకు బాలికలకు విడివిడిగా టాయిలెట్స్ నిర్మాణం చేపట్టింది. ఐటీడీఏ పీవో రాహుల్ ఐఏఎస్,ఐటీసీ పిఎస్పీడీ జనరల్ మేనేజర్ పి శ్యామ్ కిరణ్, ఐటీసీ డిజిఎం చెంగల్ రావుతో కలిసి ఎమ్మెల్యే సోమవారం లాంచనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.