డోన్: బేతంచెర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
Dhone, Nandyal | May 27, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశం కోసం రాసిన పరీక్షా ఫలితాల ఎంపిక జాబితాను ప్రభుత్వం విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ దాసు తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం ఎంపికైన విద్యార్థుల జాబితా పాఠశాలలో ఉందని, పరీక్ష రాసిన విద్యార్థులు పూర్తి వివరాల కోసం స్థానిక మోడల్ స్కూల్లో సంప్రదించాలి. ఎంపికైన విద్యార్థులు వెంటనే పాఠశాలకు వచ్చి సంబంధిత సర్టిఫికెట్లను అందజేయాలన్నారు.