మమ్మల్ని గుర్తించని వారికి మేము సహకరించం అంటున్న కారంచేడు మండలంలోని వైసిపి నాయకులు.
మమ్మల్ని గుర్తించని వారికి మేము సహకరించం అంటున్న వైసిపి నాయకులు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైసిపి నియోజకవర్గం అభ్యర్థి యడం బాలాజీ కి సహకరించమని శనివారం నాడు కారంచేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కారంచేడు ఎంపిపి నీరుకట్టు వాసు బాబు, మండల కన్వీనర్ దండా చౌదరి బాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ వైసిపి అధిష్టానం సూచించిన అసెంబ్లీ అభ్యర్థి యడం బాలాజీ మమ్మల్ని కించపరుస్తున్నాడు, పార్టీలో ఉంటే ఉండండి పోతే పోండి అంటున్నాడని అందుకని మేము బాలాజీ కి సహకరించమని ఈ సందర్భంగా రాష్ట్ర అధిష్టానానికి తెలియజేస్తున్నామని అన్నారు.