నారాయణ్‌ఖేడ్: బిసి రిజర్వేషన్ల విషయంలో బిజెపిని విమర్శిస్తే ఊరుకోం : నారాయణఖేడ్లో మండల బిజెపి అధ్యక్షుడు దశరథ్
బీసీ రిజర్వేషన్ల విషయంలో బిజెపిని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు విమర్శించడం సరికాదని నారాయణఖేడ్ మండల బిజెపి అధ్యక్షుడు దశరథ్ మండిపడ్డారు. శనివారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ల కోసం బిజెపి సహకరిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా రిజర్వేషన్ ల ప్రక్రియ నిలిచిపోయిందని విమర్శించారు. బిజెపి పార్టీని విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.