బనగానపల్లె: రోడ్డు ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం అందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి
అవుకు పట్టణంలోని మస్జిద్ ప్రాంతానికి చెందిన షేక్ యాసీన్ అనే పాలిష్ కటింగ్ కార్మికుడు విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బీసీ ఇందిరా రెడ్డి, మానవతా దృక్పథంతో బిసిజేఆర్ వెల్ఫేర్ ట్రస్ట్ తరపున బాధితుడికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.