పుంగనూరు: అంబేద్కర్ విగ్రహ స్థాపనకు భూమి పూజ.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజవర్గం. చౌడేపల్లి మండల లద్దిగం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ స్థాపనకు భూమి పూజ ను ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐ. ఆర్.ఎస్. గౌతమి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ.ఎన్ .రెడ్డప్ప, బ్యాంకు రెడ్డప్ప మునుస్వామి, చంద్రబాబు, లాజర్, సర్పంచ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.