కమలాపురం: వల్లూరు : ఏ ఓబయపల్లి దగ్గర సిమెంట్ లోడు లారీబోల్తా.. తప్పిన పెను ప్రమాదం
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని వల్లూరు మండలం ఏ ఓబయపల్లి దగ్గర ఆదివారం సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల వివరాల మేరకు డ్రైవర్ మద్యం సేవించి నడపడం వలన సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన సమయంలో అటు, ఇటు ఎవరు రాకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు.విషయం సంఘటన స్థలానికి వల్లూరు ఎస్సై పెద్ద బాబన్న తన సిబ్బందితో రోడ్డుపైన ఎటువంటి ట్రాఫిక్ లేకుండా క్లియర్ చేశారు.ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సింది.