దర్శి: దర్శి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు : ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు
Darsi, Prakasam | May 18, 2025 దర్శి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయించిన, తయారు చేసిన,అధిక ధరలకు అమ్మిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దర్శి ఎక్సైజ్ సీఐ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా మద్యం విక్రయిస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు అదేవిధంగా మద్యం దుకాణాలలో ప్రభుత్వం కేటాయించిన ధరలకే మద్యాన్ని అమ్మకాలు జరపాలని సూచించారు.అలాకాకుండా అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.