కనిగిరి: రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని విడనాడి, సత్ప్రవర్తనతో మెలగాలి: హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు
హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లకు ఆదివారం ఎస్ ఐ కే మాధవరావు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... రౌడీ షీటర్లు పాత నేర ప్రవృత్తిని విడనాడి, సత్ ప్రవర్తనతో మెలగాలన్నారు. రౌడీ షీటర్ల పై నిరంతరం పోలీస్ నిఘా కొనసాగుతుందన్నారు. మళ్లీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెయిల్ పై తిరుగుతున్న రౌడీ షీటర్లు మళ్లీ తమ పాత నేర ప్రవృత్తికి అలవాటు పడితే, బెయిల్ కూడా రద్దవుతుందని హెచ్చరించారు.