సనత్‌నగర్ ప్రాంతంలో నిర్మాణం పూర్తికాక ప్రజలకు ఇబ్బందులు తలెత్తిస్తున్న ఫతేనగర్ బ్రిడ్జిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా పరిశీలించారు. స్థానికుల సమస్యలను తెలుసుకుంటూ, పరిస్థితులను నేరుగా పరిశీలించిన కవిత, బ్రిడ్జి నిర్మాణం నాణ్యత, పనుల పురోగతి, ట్రాఫిక్‌పై పడుతున్న ప్రభావం వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించారు.