నంద్యాల అర్బన్: విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 13, 2026
నంద్యాల కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ను జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. ఎండ తీవ్రత పట్ల జాగ్రత్తగా ఉంటూ, చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ సామాన్యురాలిలా పిల్లలతో మమేకమైన తీరు అందరినీ ఆకట్టుకుంది.