డోన్: బేతంచర్ల మండలంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | May 18, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రుద్రవరం గ్రామంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి తాగునీటి బోరు వేయించారు. గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య ఉందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. బోరు వేయించి నీటి ఇబ్బందులు తీర్చినందుకు గ్రామస్థులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు