కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పట్టుకున్న ఐదు సర్పాలను అడవి ప్రాంతంలో వదిలేసినట్లు తెలిపిన ప్రాణదార ట్రస్ట్ సభ్యులు
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఇళ్లల్లో పట్టిన ఐదు సర్పాలను ఆదివారం ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ నిర్మానుష్య అడవి ప్రాంతంలో వదిలారు,వాటిలో నాలుగు నాగుపాము గా పిలువబడే విషపూరిత "నాజా నాజా" లు కాగా ఒకటి జర్రిపోతు గా పిలువబడే విషరహిత "రాట్ స్నేక్" ఉన్నట్టు సంతోష్ తెలిపారు.తన 15 సంవత్సరాల స్నేక్ రెస్క్యూ అనుభవంలో ఈ సంవత్సరం పట్టిన సర్పాలే అధికం అని రాత్రి పగలు ఎండ వాన అని తేడా ఉండదని సంతోష్ వివరించారు.రైతు నేస్తాలైన సర్పాలకు అదేవిధంగా జనాలకు మేలు చేయడమే తమ ఉద్దేశమని అన్నారు.