ఉరవకొండ: బెలుగుప్ప తండాలో ఘనంగా శ్రీ దుర్గా దేవి వార్షికోత్సవ గ్రామోత్సవం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బెలుగుప్ప తాండ గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలను నిర్వహించారు. సాయంత్రం శ్రీ దుర్గా దేవి ప్రభోత్సవాన్ని గ్రామంలో మంగళ వాయిద్యాలు డప్పులు వాస్తు బాణాసంచా కాలుస్తూ గిరిజనులందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మండలంలోని ఎలగలవంక తండా, బ్రాహ్మణపల్లి తండా, కాలువపల్లి తండా గ్రామాల్లో సైతం దుర్గాదేవి పూజలను గిరిజనులు ఆచార సంప్రదాయాల్లో భాగంగా ఘనంగా నిర్వహించారు.