బనగానపల్లె: యోగా షార్ట్ ఫిలిమ్స్ పోటీల్లో నంద్యాల జిల్లాకు రెండవ స్థానం
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యోగా షార్ట్ ఫిలిం పోటీల్లో నంద్యాల జిల్లాకు ద్వితీయ స్థానం లభించింది. ఆరోగ్యశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. బనగానపల్లెకు చెందిన యోగా ట్రైనర్ తిరుమలయ్య యోగబాట అనే షార్ట్ ఫిలిం నిర్మించారు. ప్రేమ, మత్తు, చదువుపై అశ్రద్ధ అనే మూడు పాత్రలతో ఈ షార్ట్ ఫిలిం ఉంటుంది. యోగానే అన్నింటికీ పరిష్కారం చూపుతుందని ఈ షార్ట్ ఫిలిం ద్వార తెలియజేశారు.