చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలను బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్లోళ్ల కార్తిక్ రెడ్డి పరామర్శించారు. మీర్జాగూడ వద్ద మలుపు కూడా ఉందని, అక్కడ చెట్లు తొలగించలేదని, రోడ్డు పనులు కూడా చేయలేదని, దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కార్తిక్ రెడ్డి కోరారు.