హిమాయత్ నగర్: జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ విన్యాసాలు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తిపరచేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విన్యాసాలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకులను బెదిరిస్తూ, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మద్దతుదారులను భయపెట్టి తమకు ఓటు వేయమని కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మద్దతు కాదు, ఎంఐఎం మద్దతే సరిపోతుందనే ధోరణిలో కాంగ్రెస్ వ్యవహరిస్తోంది అన్నారు.