రాయచోటి ట్రాఫిక్ పరిధిలో ట్రాఫిక్ సీఐ శ్రీ ఎస్. కుళాయిప్ప గారు తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేసిన సందర్భంగా, డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఆరుగురిపై చర్యలు తీసుకున్నారు.వారిని అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రాయచోటి గారి ముందు హాజరుపరచగా, మేజిస్ట్రేట్ గారు ఒక్కొక్కరికి రూ.10,100 చొప్పున మొత్తం రూ.60,600 (అరువై వేల ఆరు వందలు) జరిమానా విధించారు.జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు రాయచోటి ట్రాఫిక్ సీఐ శ్రీ ఎస్. కుళాయిప్ప గారు మాట్లాడుతూ, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు పటిష్టంగా కొనసాగుతాయని, మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని హె