ఆత్మకూరు: ఆత్మకూరులో బైక్ ను ఢీకొట్టిన ఆటో, సోషల్ మీడియాలో సీసీ టీవీ వీడియో #viral
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని నాగేంద్రపురానికి చెందిన వ్యక్తి బైకుపై ఇంటికి బయల్దేరాడు. అదే సమయంలో బస్టాండ్ నుంచి ఓ ఆటో ప్రయాణికులతో బయల్దేరింది. ఆటో స్టార్ట్ చేసిన వెంటనే బైకును ఢీకొట్టింది. ప్రమాద దృశ్యాలు బస్టాండ్లోని ఓ సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని చికిత్స నెల్లూరుకు తరలించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సిసి టీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో ఆత్మకూరు నియోజకవర్గంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో స్థానికులు తీవ్రభయాం