కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో బస్సుల్లో కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి 9 గంటలకు ప్రైవేట్ , ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సులలో సరైన భద్రతా చర్యలు , జాగ్రత్తలు పాటించాలని బస్సులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సుల వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు. అవి సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు కర్నూలు పోలీసులు భారీ వాహానాలకు “స్టాప్ - వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు.