ఖైరతాబాద్: 30 వేల ఎకరాల్లో భారత్ ఫీచర్ సిటీ : సీఎం రేవంత్ రెడ్డి
శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలన వేడుకల్లో మాట్లాడుతూ.. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచానికే వేదిక అవుతుందని, త్వరలోనే ఆ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈ సిటీ తెలంగాణ ఆదాయాన్ని పెంచుతుందని సీఎం పేర్కొన్నారు.