కనిగిరి: కుటుంబ సాధికార కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలి: పామూరు మండల టిడిపి అధ్యక్షులు నరసింహారావు
పామూరు పట్టణంలో టిడిపి కుటుంబ సాధికార కమిటీ సభ్యుల సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి హాజరైన పామూరు మండల టిడిపి అధ్యక్షులు బొల్లా నరసింహారావు మాట్లాడుతూ... కుటుంబ సాధికార కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయవలసి ఉంటుందన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దృష్టికి తీసుకువచ్చి, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.