కరీంనగర్: కిసాన్ నగర్ కు చెందిన తిరుపతి అనే వ్యక్తి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ ప్రాంతానికి చెందిన అల్లపు తిరుపతి అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఏదో గుర్తుతెలని ముందు తాగి ఆసుపత్రిలో చికిత్సలతో మృతి చెందిన కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. తిరుపతి స్వస్థలం తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామం కాగా కొంతకాలంగా కరీంనగర్ లో ఉంటూ కూలి పని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల తో ఇటీవల ఆత్మహత్యయత్నం చేయగా గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదికి తరలించి , కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.