బనగానపల్లె: రైతుల సంక్షేమం కోసమే కొత్త పాస్ పుస్తకాలు : బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి బనగానపల్లె మండలం బీరవోలులో మంత్రి నూతన పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. సందర్భంగా గ్రామంలో రూ.40 లక్షలతో ఏర్పాటుచేసిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో RDO నరేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు.